రైతులు ఆందోళన చెందక్కర్లేదు: కురసాల కన్నబాబు

 తాడేపల్లి: రైతుల్ని కరోనా పేరుతో భయానికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. కరోనా సాకు చూపించి రైతుల పండించిన పంటలు, పళ్ల ధరలు తగ్గించే పని చేస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా ప్రభావం, దళారుల విష ప్రచారంతో రైతులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.